అల్లా శత్రువులను నిర్మూలించడానికి సిరియాకే రావలసిన అవసరం లేదని వారెక్కడ ఉన్నా తామున్న చోటే అల్లా శత్రువులను చంపే మార్గాలు బోలెడు ఉంటాయని మార్గనిర్దేశనం చేస్తూ ఇస్లామిక్ స్టేట్ శనివారం విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేయడమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలను వణికిస్తోంది. ప్యారిస్ తరహా దాడులను కొనసాగించి పవిత్ర యుద్ధం చేయడానికి సిరియాకు రాలేని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయని ఐఎస్ సూచించింది.

 

అల్లా శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా, ఏమూల ఉన్నా వారిని చంపేయవలసిందిగా మీరు అల్లా ఆదేశాలను అందుకున్నారు. అలాంటప్పడు మీరు అవకాశాలకోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు? ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయుధాలూ ఉన్నాయి. కార్లూ ఉన్నాయి. పైగా దాడులు చేయవలసిన లక్ష్యాలూ మీ ముందున్నాయి వాటిని నెరవేర్చడానికి ఎవరి ఆదేశాలకో ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ ఒకరు ఆ వీడియోలో పేర్కొన్నారు.

 

ఇవేవీ మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడ చూసినా విషం ఉంది, సులభంగా దొరకుతుంది. అల్లా శత్రువులను ఒక్కరంటే ఒక్కరిని చంపడానికి కనీసం నీటిలో విషం కలపాలని, ఆహారంలో విషం కలపాలని ఐఎస్ మిలిటెంట్ ప్రకటించాడు. ఉగ్రవాద దాడుల స్వభావాన్నే పూర్తిగా మార్చివేయనున్న ఈ వీడియో ప్రకటన యావత్ప్రపంచానికి ఇప్పుడే నిజమైన సవాలు విసురుతోంది. 700 కోట్ల మంది ప్రపంచ ప్రజలు ఇక తాము తినే తిండి, తాగే నీటిని కూడా అనుమానించాల్సిన పరిస్థితిని ఈ సింగిల్ వీడియో సృష్టించి పడేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: