నగ్నత్వం.. ఎప్పుడూ సంచలనమే.. మూసిన గుప్పిట విప్పితే.. మనిషికి ఆరాటమే. అందుకే న్యూడిటీపై అంత ఆసక్తి. అయితే సినిమాలు, బుల్లితెరపై నగ్నత్వానికి పరిమితులున్నాయి. కొంతమంది హీరోయిన్లు, దర్శకులు సాహసం చేసినా.. సెన్సార్ కత్తెరలు వాళ్ల కాళ్లకు బంధాలు వేస్తాయి. కానీ అలాంటి అడ్డంకులు లేని కళ ఒకటుంది. అదే పెయింటింగ్.. చిత్రలేఖనం ద్వారా నగ్నత్వ కోణాలను ఆవిష్కరించిన చిత్రకారులెందరో. 

పెయింటిగ్స్ లో న్యూడిటీ కామన్.. అందులో విభిన్న కోణాలను ఆవిష్కరించిన నగ్న చిత్రాలకు గిరాకీ కూడా ఎక్కువే. లేటెస్టుగా.. ఓ నగ్న చిత్రం కళ్లు చెరిరే రేటుకు అమ్ముడుపోయి సంచనలం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1100 కోట్ల రూపాయల ధర పలికింది. ఓ న్యూడ్ పెయింటింగ్ కు ఇంత ధర పలకడం ఇటీవలి కాలంలో ఇదే అత్యధకమంట.

మరి ఇంత ధర పెట్టి కొనుక్కున్న వ్యక్తి సామాన్యుడు అయి ఉండదు కదా.. కానీ అతను సామాన్యుడే.. సామాన్యుడి స్థాయి నుంచి అపర కోటీశ్వరుడుగా మారిన వ్యక్తి. అతనే చైనాలో లీ యిక్వియాన్. ఈయన గతంలోనూ అనేక పెయింటింగులు రికార్డు స్థాయి ధరకు కొన్నాడట. మరి అలాగని అతడిని తక్కువ అంచనా వేయకండి. ఏ పెయింటింగు ఎంత ధరపలుకుతుంతో అంచనా వేయడంలో ఈయన సిద్ధహస్తుడట. 

ఈయన భార్య ఓ ప్రైవేట్ మ్యూజియం నిర్వహిస్తోందట. దాని కోసమే  లీ యిక్వియాన్ ఈ పెయింటింగ్ కొన్నాడట. ఇన్ని సంచలనాలకు కారణమైన.. ఈ హైయ్యెస్ట్ పెయిడ్ న్యూడ్ పెయింటింగ్ గీసిన వ్యక్తి పేరు అమెడియో మోడిగ్లియా. ఈ చిత్రం పేరు న్యూడో రోసా. అంటే నగ్నంగా ఉన్న మహిళ అని అర్థం. అన్నట్టు.. ఇంత ధర పెట్టిన పెయింటింగ్ కొన్న లీ యిక్వియాన్ గతంలో ఓ ట్యాక్సీ డ్రైవర్ కావడం విశేషం. వారెన్ బఫెట్ తరహాలో స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టి చైనా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: