ఈ మద్య కాలంలో చదువుకోసం వెళ్లి విద్యార్థులు కాలేజీలో రాక్షసుల్లా మారుతున్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తూ వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఆత్మహత్యలు చేసుకునే వారు తీసుకు వస్తున్నారు. తోటి విద్యార్థులు చదువుకోవడానికి వస్తే వాళ్ల పాలిట యమదూతల్లా తయారు అవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఈ ర్యాగింగ్ కల్చర్ మాత్రం అరికట్ట లేక పోతున్నాయి.

తాజాగా కూకట్‌పల్లి నిజాంపేట్‌లో బీటెక్ విద్యార్థి వెంకటకృష్ణ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని సత్యబామ విశ్వవిద్యాలయంలో చైతన్య బీటెక్ చదువుతున్నాడు. సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి ఇంట్లో తన బెడ్‌రూం తలుపులు మూసుకుని ఎంతకూ తెరవలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గది తలుపు తెరిచేలోగా అక్కడే ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సూసైడ్ లెటర్


తాను చదివే కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న సీనియర్‌ విద్యార్థి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌నోట్‌ రాసి కృష్ణచైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన స్థలంలో తనను చిత్రహింసలకు గురిచేశారని చైతన్య 8 పేజీల సూసైడ్‌నోట్ రాసినట్లు సమాచారం. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: