కేంద్ర ప్రభుత్వం నూతన గృహ నిర్మాణాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం యాదృచ్ఛికం కాదని, ఏపీ ప్రభుత్వం, అధికారులు తక్షణం స్పందించి కేంద్ర కోరిన వివరాలను సమగ్రంగా అందించినందుకో ఆంద్రప్రదేశ్‌కు జాక్ పాట్ తగిలిందని ఇప్పుడు అర్థమవుతోంది. కానీ తెలుగు దేశం అనుకూల మీడియా మాత్రం ఈ విషయాన్ని గోరంతలు కొండంతలుగా చేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం వింత గొల్పుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


ప్రధాని మోదీ గత 18 నెలలుగా విదేశీ సంబంధాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంతో సంక్షేమ కార్యక్రమాలు అడుగు ముందుకు పడలేదన్న మాట వాస్తవం. భారత్లో ఎన్నికలు గెలవాలంటే తప్పకుండా అమలు చేయవలసిన అతి ముఖ్యమైన సామాజిక సంక్షేమ పథకాల విషయంలో మోదీ ప్రభుత్వం వెనుకబడి ఉంది. 


2022నాటికల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ గృహ కల్పన కలిగించాలనే లక్ష్యాన్ని గతంలోనే మోదీ ప్రకటించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేసరికి ఈ పథకం తనకు అత్యంత అధిక ప్రయోజనాలు కలిగిస్తుందని మోదీ బలంగా అభిప్రాయపడుతున్నారు. ఇంత భారీ పథకాన్ని అమలు చేయాలంటే దానికి సమర్థుడు చంద్రబాబేనని మోదీ భావించారని టీడీపీ అనుకూల మీడియా టముకు వాయిస్తోంది. చంద్రబాబు సమర్థతపై అపార విశ్వాసంతోనే కేంద్రం ప్రకటించిన అందరికీ ఇళ్లు గృహ పథకం కేటాయింపుల్లో 75 శాతం ఒక్క ఆంద్రప్రదేశ్‌కే దక్కాయని వీరు కోడై కూస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి ఇంటికీ 1.5 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నిధులు అందనున్నాయి. 


కానీ డబ్బు దుబారా విషయంలో చంద్రబాబు వ్యవహారాన్ని గమనించిన కేంద్రం తదనుగుణంగానే నేరుగా డబ్బులు అందించకుండా సంక్షేమ పథకం రూపంలో ఆ మొత్తాలను అందిస్తోందని, దీంట్లో ప్రభుత్వం కొల్లగొట్టడానికి ఏమీ ఉండదని టీటీపీ వ్యతిరేక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: