బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సంగా కురిసాయి. ఇక తమిళనాడు అయితే మొత్తం నీట మునిగిపోయింది. జనావాస ప్రాంతాలు నీట మునిగి, పంటలు, ఆస్తులు, రోడ్లు దెబ్బతినడం వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. వానలు, వరదల వల్ల రాష్ట్రానికి రూ.8,481 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, 169 మంది చనిపోయారని వివరిస్తూ సీఎం జయలలిత ప్రధానికి లేఖ రాశారు.

సహాయ కార్యక్రమాల కోసం తక్షణం రూ.2000కోట్లు అందించాలని, నష్టాల అంచనాలకు కేంద్ర బృందాన్ని పంపాని కోరారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడుకు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం రూ.940 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు.  లేఖను ప్రత్యేక ప్రతినిధి జక్కయన్ ద్వారా ప్రధానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ సహాయాన్ని మంజూరుచేసినట్టు ఆ ప్రకటనలో వెల్లడించారు.

వరదలతో నీటమునిగిన జనజీవనం


ఐతే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏపీకి సాయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. అమిత్ షా మాత్రం త‌న తరపున కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడుకు తగ్గకుండా సాయం చేస్తారా లేక హుద్‌హుద్‌ సమయంలోలాగే హ్యాండిస్తారా అన్నది తేలాలి. హుద్‌హుద్‌ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పింది. వరద నష్టాల అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించనున్నామని, ఆ బృందం నివేదిక అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటన పేర్కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: