తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు వరంగల్ వైపే ఉంది.. ఎందుకంటే ఉప ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలు హోరా హోరీగా ప్రచారాలు చేశాయి. ఇకపోతే ఫలితాలు మాత్రం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ దాదాపు 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగతూనే ఉంది. అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిపై నల్లగొండ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్ష పాలన నడుస్తుందని అన్నారు. త్వరలో ప్రజలు ఆయన పాలనపై వ్యతిరేకత చూపిస్తారని అన్నారు.  టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా అన్నారు.  

టీఆర్ఎస్ నాయకుల విజయోత్సవ సంబరాలు 


ఇక వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని టీఆర్ఎస్ పాలన అంతం చేయడమే లక్ష్యమని అన్నారు. అందుకు అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు.  అంతా బాగానే ఉంది కానీ భవిష్యత్ మాత్రం ఎవరు చెప్పగలరు. ఏ నాయకుడు ఎటు వైపు మళ్లుతారో ఎవరికీ అర్థం కానీ రాజకీయ వ్యవస్థలో ఇలాంటి మాటలు మామూలే. అయితే గుత్తా సుఖేందర్ పొత్తు విషయంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: