తమిళనాడులో అమ్మగా పిలుచుకునే ముఖ్యమంత్రి జయలలితకు మద్రాస్ హై కోర్టు షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన  'నిర్బంధ తమిళం' హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో తమిళనాడులో తెలుగు విద్యార్థులకు (మైనార్టీ భాషా విద్యార్థులకు) ఊరట లభించింది. 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన 'నిర్బంధ తమిళం' జీవో మేరకు వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్ని తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషా విద్యార్థులు తమిళంలోనే రాయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ కొంతకాలంగా ఇక్కడి తెలుగు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అయినా జయలలిత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య నేతృత్వంలోని మైనారిటీ భాషా సంఘాలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కె కౌల్‌, న్యాయమూర్తి పి.సత్యనారాయాణనలతో కూడిన ప్రథమ ధర్మాసనం సోమవారం మైనారిటీ భాషల వారికి ప్రతికూలంగా తీర్పు చెప్పింది.

మద్రాస్ హై కోర్టు


నిర్బంధ తమిళంపై చేసిన చట్టం సదుద్దేశంతో రూపొందించినది కాదని, ఆ తరువాత కూడా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది.  ఈ యేడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి మైనారిటీ భాషా విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేయాలని అటువంటి వారికి 30 రోజుల్లోగా వారి మాతృభాషల్లో పరీక్షలు రాయడానికి సంబంధించి మరికొంత వెసులుబాటు కోరుతూ మైనారిటీ భాషాప్రతినిధులు మరో పిటీషన్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచన చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: