దేశంలో ఇప్పుడు రాజకీయ నాయకుల హవా నడుస్తుంది. ఒక్కసారి రాజకీయంలోకి వచ్చారంటే..అంతే వారికి ఎదురులేదు. గల్లీలో చోటా మోటా నాయకులు కూడా ఈ మద్య తమ హవా చాటుకుంటున్నారు. పేద ప్రజలకు తమ నాయకుడే దేవుడు అంటూ ప్రచారాలు కూడా చేస్తుంటారు. ఇక చిన్న పదవులు గనక వారికి సొంతమైతే చాలు నానా హంగామా చేస్తారు. అధికార పార్టీ నాయకులైతే మరీనూ..వారి చెప్పిందే వేదం చేసేదే శాసనం అన్న చందంగా ఉంటుంది.  తామేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది వారి ధీమా. ప్రభుత్వ సొమ్మును వాడుకోవడంలో ముందువరుసలో వారే ఉంటారు.

మన దేశంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎంపికయిన వారికి జనం సొమ్మును తినడంపై పూర్తి హక్కు ఉందని భావిస్తుంటారు. ఎందుకంటే తాము గెలిచేందుకు డబ్బు ఖర్చు పెట్టాం మరి అది ఎక్కడ నుంచి వసూళ్లు చేసుకోవాలని అని ప్రశ్నించిన నాయకులు కూడా లేకపోలేదు. ఇలాంటి వారిపై ఆరోపణలు గనక చేస్తే ప్రతిపక్షం పన్నిన కుట్ర అని వారిపై తోసేస్తారు.  కానీ ప్రకాశం జిల్లాలోఒక ప్రజా ప్రతినిధి వ్యవహారం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. సినిమాలో చూపించే మంచి లీడర్ తరహాలో ఈ ప్రజా ప్రతినిధి ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు.  ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ హరిబాబు  ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నాడని జెడ్పీ సభ్యులు ఆరోపించారు.

ఆ ఆరోపణలుకు బాధపడిన హరిబాబు మధ్యాహ్న భోజన విరామ సమయంలో జెడ్పీ కార్యాలయం ఆవరణలో చాలా సేపు ఎండలోనే నిలబడిపోయాడు. అనుచరలు వారించినా కూడా తను తప్పు చేసానని అందరూ ఆరోపిస్తున్నారు అందుకే తనకు తాను శిక్షించుకుంటున్నా అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా చూసుకుంటానని చెప్పారు. ఏది ఏమైనా తమ స్వార్థం కోసం రాజకీయాన్ని వాడుకునే ఈ రోజుల్లో ఇలా శిక్షించుకొన్న ప్రజాప్రతినిధిని చూసిం అందరూ బుద్ది తెచ్చుకోవాలని అంటున్నారు ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: