ప్రపంచంలో ఉగ్రదాడులు విపరీతమైనాయి..ఎక్కడ నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని ప్రపంచ దేశాలు భయాందోళనలో ఉన్నాయి. పారిస్ పై దాడులు.. రష్యా విమానాన్ని కూల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడిన ఉగ్రవాదుల ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దాడులు చేస్తాం అని బహింగంగానే హెచ్చరిస్తున్నాయి. ఆ మద్య అమెరికాలోని వైట్ హౌజ్ ను పేల్చి వేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు.

 ఈ నేపథ్యంలో అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ పర్యటనలకు వెళ్లే అమెరికా పౌరులారా తస్మాత్ జాగ్రత్త అంటూ అప్రమత్తతను(ట్రావెల్ అలర్ట్) గుర్తు చేసింది. అంతేగాకుండా ఉగ్రవాద సంస్థలు ఆయుధాలతో మాత్రమే కాకుండా.. భౌతిక దాడులకు కూడా పాల్పడవచ్చునని అమెరికా సర్కారు తన వెబ్ సైట్‌లో తెలిపింది. అమెరికన్ల కోసం పలు ఉగ్రవాద సంస్థలు ఏ దేశంపైనైనా విరుచుకుపడేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నాయని అమెరికా సర్కార్ తన అధికారిక వెబ్ సైట్‌లో హెచ్చరించింది.

ఉగ్రవాద సంస్థలు


జన సమూహాల మధ్య ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ 'ట్రావెల్ అలర్ట్' ప్రకటించింది. ఇటీవల తాము వైట్ హౌస్‌తో పాటు న్యూయార్క్ నూ లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని ఐఎస్ఐఎస్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, బోకోహారమ్ తదితర ఉగ్రవాద సంస్థలు ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని అమెరికా పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: