జీవితంలో అతి తక్కువ వనరులు ఉన్నప్పటికీ కొంతమంది ప్రజలు సంతోషంగా ఎలా గడుపుతున్నారని మీకెప్పుడయినా అనిపించిందా? జీవితంలోని మంచి విషయాలను కొంతమందే ఎందుకు ఎక్కువగా ఆస్వాదిస్తుంటారని మీరెప్పుడయినా ప్రశ్నించుకున్నారా? ఏం ఫర్వాలేదు. ఈ సంతోష రహస్యాన్ని శాస్త్రజ్ఞులు ఇప్పుడు కనిపెట్టేశారు మరి.

 

మనుషుల్లో ఎక్కువ సంతోషానికి కారణం మెదడు ప్రాంతంలోని బూడిదరంగు పదార్థం ఎక్కువగా ఉండటమేనంటూ శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మెదడులోని ఈ బూడిదరంగు పదార్థాన్ని ఇంగ్లీషులో ప్రెక్యునియస్ అని పిలుస్తారు. చాలా తరచుగా సంతోషాన్ని ఫీలయ్యేవారు, జీవితానికి నిజమైన అర్థాన్ని మరింతగా కనుగొనేవారికి మెదడులోని బూడిదరంగు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వీరు చెబుతున్నారు.

 

జపాన్‌లోని క్యోటో యూనివర్శిటీ అధ్యయన బృంద నేత వాటరూ సాటో తమ తాజా పరిశోధన వివరాలను వెల్లడించారు.  మెదడులో సంతోషం ఎక్కడ నుంచి పుడుతోందన్న విషయంపై బయటపడ్డ ఈ కొత్త జ్ఞానం శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి సంతోష కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుందని సాటో చెప్పారు. సంతోషం అనేది ఆహ్లాదకరమైన ఉద్వేగాలు మరియు జీవితంలోని సంతృప్తి మేళనమేనని మెదడులోని బూడిద రంగు పదార్థం లోంచే ఇవి పుట్టుకొస్తుంటాయని వీరి అధ్యయనం నిర్ధారించింది.

 

సంతోషం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచీ వస్తోంది అనే విషయంపై కొత్త సత్యాన్ని కనుగొన్నందుకు జపాన్ పరిశోధకులు నిజంగా సంతోషంగా ఉందంటున్నారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: