అనుష్క. తెలుగు తెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్న నాయకి. కేవలం గ్లామర్ ఆధారంగా కాకుండా నటనతో ఆకట్టుకుంటోంది. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ప్రయోగాత్మక నిర్మాతకు కొంగుబంగారంగా మారింది. మొన్న డీగ్లామర్ పాత్రతో బాహుబలిలో కనిపించింది. నిన్న కత్తి పట్టి రుద్రమదేవినంటూ అలరించింది. సంవత్సరాల తరబడి షూటింగ్ సాగుతున్నా సహనంతో సహకరించింది. 

ఇప్పుడు సైజ్ జీరో సినిమాతో మరోసారి అనుష్క మాయచేయబోతోంది. ఒకే సినిమాలో సన్నగా, లావుగా కనిపించబోతోంది. ఇలాంటి రిస్కులు గతంలో హీరోలు చేయడం చూశాం. విక్రం లాంటి హీరో ఐ సినిమాలో ఇలాంటి రిస్కే చేశాడు. కానీ ఓ హీరోయిన్ అలా చేయడం ఇదే మొదటిసారి. అయితే అనుష్క అంత కష్టపడి ఇష్టంగా నటించిన సినిమాకు ఇప్పుడు ఎఫైర్ చిక్కు వచ్చి పడింది. 

ఎఫైర్ చిక్కు అంటే.. అనుష్క ఎఫైర్లో చిక్కుకుందని కాదండోయ్.. అనుష్క సినిమా రిలీజ్ రోజే ఎఫైర్ అని మరో సినిమా రిలీజ్ కాబోతోంది. అనుష్క సినిమాకు ఆ సినిమా పోటీ  వస్తుందా..అంత సీన్ ఉందా.. అన్న సంగతి పక్కకు పెడితే.. ఈనెల 27న.. ఒకే రోజు రిలీజ్ కావడం కొంతవరకూ ప్రభావం చూపొచ్చు. 

ఎఫైర్ సినిమా విషయానికి వస్తే యాంకర్ ప్రశాంతి హాట్ హాట్ గా నటించిన సినిమా ఇది. ఇద్దరమ్మాయిల ప్రేమ కథకు హార్రర్ జోడించిన క్రైమ్ సినిమా. క్రైమ్, హారర్ సినిమాలకు ఆదరణ లభిస్తున్న సమయంలో ఒకవేళ ఎఫైర్ కనుక అనుహ్యంగా బాగా ఆడితే సైజ్ జీరోకు చిక్కులు తప్పవు. మరి ఈ రెండు సినిమాలను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: