తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్మ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కన్న కూతురు పాలిట యమదూతలైన తల్లిదండ్రులు, సొంత అన్నయ్య,వదినలు ఇప్పుడు పాపం పండి ఇప్పటికే జైలు ఊసలు లెక్కబెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కృపామణి ఆత్మహత్య కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు కొంత పురోగతి సాధించారు.

గత కొంత కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ప్రధాన నింధితుడు  సాయి శ్రీనివాస్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.  .కన్న తల్లిదండ్రులే సాయి శ్రీనివాస్‌ తో వ్యభిచారం చేయాలని గదిలో బంధించి వేదించడంతో కృపామణి గత నెలలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆత్మహత్యకు ముందు ఆమె తన సెల్‌ఫోన్‌లో తీసిన సెల్ఫీ ఆదారంగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన రౌడీషీటర్‌ సాయి శ్రీనివాస్‌ కోసం పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు.

ఆత్మహత్య చేసుకున్న కృపామణి 


పశ్చిమగోదావరి జిల్లాను వదిలి హైదరాబాదులో తలదాచుకున్న శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు నిన్న రాత్రి అతడిని అరెస్ట్ చేసిన అనంతరం నిన్న రాత్రే అతడిని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించినట్టు సమాచారం.  ఆదరిస్తారని కన్నవారింటికి వస్తే కఠిన హృదయాలతో కన్న కూతురిచే వ్యభిచారం చేయించాలని ప్రయత్నించి ఆ కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: