భారత  దేశంలో కొత్తగా ఎన్నో పార్టీలు పుట్టుకు వచ్చినా అవి ఎక్కడా నిలబడలేదు.. కానీ ఢిల్లీలో ఒక సామాన్య పార్టీగా ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది.. ఎన్నో ఉన్నత ఆశయాలతో ఎన్నికల్లో నిలబడి ప్రజల మన్ననలు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించడానికి చాలా కష్ట పడ్డారు. 



ఒకదశలో ముఖ్యమంత్రిగా గెలిచినా తన ముందు అన్యాయం జరిగిందని ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఢిల్లీలో అదికారంలోకి వచ్చామన్న సంతోషం ఆమ్ ఆద్మి పార్టీకి మిగలడం లేదు. ఆప్ నేతలకు కొత్తవే కావొచ్చు.. పాతవే కావచ్చు  ఏదో ఒకదానిలో ఆమ్ ఆద్మి పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.తాజాగా మరో ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ నేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో అఖిలేష్ త్రిపాఠీ


అఖిలేష్ త్రిపాఠి అనే ఈ ఎమ్మెల్యే 2013 నాటి అల్లర్లకు కారణం అంటూ డిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఆయనను కోర్టు జ్యుడిషియల్ కస్టడీ కి పంపింది.దీంతో ఇంతవరకు అరెస్టు అయిన ఆమ్ ఆద్మి పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఐదు కు చేరింది. అఖిలేష్ పై మరిన్ని కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గృహ హింస కేసులో ఒకరు.. నకిలీ డిగ్రీ పట్టాతో ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ పరువు తీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: