ఆంధ్రప్రదేశ్ లో ఆనం బ్రదర్స్ అంటే మంచి పేరు ఉన్న రాజకీయ నాయకులని ఎవ్వరికైనా తెలుసు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత  ఆనం నారాయణరెడ్డి ఆయన కేబినెట్ లో కీలక భూమిక పోషించారు. వైఎస్ అకాల మరణం తర్వాత రోశయ్య కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ అదే పదవిలో కొనసాగారు.

ఇక వివాదాస్పద ప్రకటనలకే కాక ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి నిత్యం వార్తల్లో ఉంటారు.  1989 లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో కూడా రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు.రామనారాయణరెడ్డి 1983,85 లలో టిడిపి పక్షాన, 1999,2004, 2009 లలో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, ఆనం బ్రదర్స్ కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైన ఆనం బ్రదర్స్ తిరిగి సొంత గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు.

టీడీపీ


వీరి చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించడమే కాక వారికిచ్చే పార్టీ పదవులను కూడా ఖరారు చేశారని సమాచారం. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జీ బాధ్యతలు జూనియర్ ఆనంకు, నెల్లూరు రూరల్ ఇన్ చార్జీ బాధ్యతలు సీనియర్ ఆనం కొడుకుకు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.దాదాపు 25 ఏళ్ల పాటు వారు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. తిరిగి రామనారాయణరెడ్డి టిడిపిలో ప్రవేశిస్తుండడం విశేశం.


మరింత సమాచారం తెలుసుకోండి: