చిత్తూరు జిల్లాలోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు హల్ చల్ సృష్టించారు.  బోర్డింగ్ పాస్ కు సంబందించి గొడవ ఆరంభం కావడంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి అయిన మిధున్ రెడ్డి మేనేజర్ పై దురుసుగా ప్రవర్తించగా, అక్కడే ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర నేతలు కూడా దౌర్జన్యానికి దిగారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో వాగ్వాదం ముదిరింది.

దీంతో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ఇతర కార్యకర్తలు మేనేజర్ పైన చేయి చేసుకున్నారు.  అనంతరం వారు బలవంతంగా విమానాశ్రయంలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

జగన్ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.  గౌరవ ప్రదమైన ఒక ఎంపీ స్థానంలో ఉన్న నేత ఇలా ప్రవర్తించడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి నేతలనా మనం ఎన్నుకొన్నది అని వాపోయారు.  గాయపడ్డ మేనేజర్ ను తిరుపతి ఆస్పత్రిలో చేర్చారు.కాగా సిసి టీవీపుటేజీ ఆదారంగా ఏ కేసు పెట్టాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: