బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో  బీభత్సంగా వర్షాలు కురిసాయి. గత రెండు వారాలుగా  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు, చెరువుల కట్టలు తెగి ఊళ్లకు ఊళ్లు మునుగుతున్నాయి. పంట పొలాలన్నీ నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లోని పంట నాశనమైంది. తమిళనాడులో భారీ వర్షాలకు మృతిచెందిన వారి సంఖ్య 122కు పెరిగింది.  భారీ వర్షాలు కురవనున్నట్లు చెన్నై వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాలను హెచ్చరించింది .  

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విజ్క్షప్తి మేరకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడుకు 940 కోట్లు విడుదల చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో  కేంద్రాన్ని నిధులు కోరుతూ మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖరాసింది. భారీ వర్షాలకు దెబ్బ పంట, వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని మోడీ అన్నారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయాలని సూచనలు చేశారు. 

పంట నష్టాన్ని చూపిస్తున్న రైతులు


తమిళనాడులో వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు.  మరో వైపు రాష్ట్రంలో వర్షాల దెబ్బకు రూ 8.481 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. 2,000 కోట్లు పనుల కోసం కొనసాగించేందుకు విడుదల చేశాలని మోడీకి జయలలిత లేఖ రాశారు. తమిళనాడు జలదిగ్భంధంలో చిక్కున్న వేళ ఇప్పటికే ముమ్మర సహాయ సహకారలు అందిస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జయలలిత ఆర్ కే నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. స్థానికులు సమస్యలు అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: