ఆ మద్య దేశంలో సంచలనం సృష్టించిన ‘కిస్ ఆఫ్ లవ్’ వ్యవస్థాపకుడు రాహుల్ దుర్మార్గాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. దేశానికే నీతులు చెప్పిన ఆ ఇద్ద‌రూ ఇప్పుడు వివాదాల‌కు కేంద్ర బిందువు అవుతున్నారు. ‘కిస్ ఆఫ్ లవ్’ వ్యవస్థాపకుడు రాహుల్ నిజ స్వరూపాన్ని అతని భార్య రేష్మి గుట్టు విప్పింది. ఈ మధ్యన వారిద్దరిని ఆన్ లైన్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేరళ జంట పలు విషయాలు పేర్కొన్నట్లు చెబుతున్నారు.

అన్నింటికి మించి.. కిస్ ఆఫ్ లవ్ వ్యవస్థాపకుడి రాహుల్ వైఖరిపై అతడి భార్య రేష్మి చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి తీసుకొస్తున్నట్లు పోలీసులు తేల్చారు. గట్టి నిఘా వేసి నిందితులను అరెస్ట్ చేశారు. కాసులు కోసం వీరెంత‌గా దిగ‌జారారో అర్థం చేసుకోవ‌చ్చు. కేరళలో మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా గత ఏడాది కిస్ ఆప్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన రష్మి, రాహుల్ దంపతులు అనంతరం పాపులర్ అయ్యారు. ఐతే..ఈ ముసుగులో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వెలుగుచూసింది.

 ‘కిస్ ఆఫ్ లవ్’ వ్యవస్థాపకుడు రాహుల్,రేష్మి 


ఈ కేసులో రష్మి, రాహుల్‌తో పాటు పది మంది అరెస్టయ్యారు. అయితే తన భర్త రాహుల్ ఈ ఆన్‌లైన్ సెక్స్ వ్యాపారానికి సూత్రధారి అని, ఆయనే తనను ఈ వ్యభిచార రొంపిలోకి దించాడని రష్మి పోలీసులకు తెలిపింది. తన నగ్న ఫోటోలు నెట్‌లో పోస్ట్ చేసి ప్రముఖులతో డీల్ చేసినట్లు పేర్కొం ది. రష్మి పేరుతో రాహుల్ క్రియేట్ చేసిన ఫేస్ బుక్ ఖాతాను కూడా పోలీసులు గుర్తించారు.భర్త మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్న రేష్మి.. పోలీసులు పట్టుకోకముందే పోలీసుల వద్దకు వచ్చి తన భర్త చేస్తున్న వేధింపుల గురించి ఎందుకు ఫిర్యాదు చేయనట్లు..


మరింత సమాచారం తెలుసుకోండి: