దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జీకి మరో ఒకట్రెండు రోజుల్లో సీబీఐ లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ సింగ్ లపై 1000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి ఆగస్టులో కోర్టు నవంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ  విధించింది.


అయితే ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను అరెస్టు చేయడంతో ఈ కేసులో ఆయన ప్రమేయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన షీనాబోరా హత్యకేసు ఉదంతంలో పీటర్‌ ముఖర్జీని వారం క్రితం అరెస్టు చేయడం, శుక్రవారం ఆయనపై నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఈ కేసులో మరింత స్పష్టతను సాధించే అవకాశాలు ఉన్నాయి.


ఇంద్రాణి ముఖర్జియా,  పీటర్ ముఖర్జియా

peter-mukerjea_story_647_090215102716

ఈ హత్యకేసులో పీటర్‌ను శుక్రవారం ఆరుగంటలపాటు మరోసారి విచారించింది. పలుమార్లు ప్రశ్నించినా, పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఆయనను ఈ పరీక్షకు గురిచేస్తే చాలా ప్రయోజనం ఉంటుందని సీబీఐ నమ్మకం. రెండుమూడు రోజుల్లో జరిపే ఈ పరీక్షలో ఆయనకు ఈ హత్యతో సంబంధం ఉన్నదన్న సీబీఐ వాదనకు స్పష్టమైన ఆధారాలు లభించవచ్చు బావిస్తున్నారు. . పాలిగ్రాఫ్ టెస్టులను నిర్వహించడానికి ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. పీటర్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో సోమవారం ఆయనను కోర్టులో హజరుపరుచనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: