జాతీయ రాజకీయాలలో ఎప్పుడూ లేని ఒక ఆసక్తికర అంశం తెర మీదకి వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నడూ లేనట్టుగా 'ఏకాభిప్రాయం' అనే అంశం మీద అధికార - విపక్షాలు స్నేహ హాస్తం చాపాయి. ఇది నిజంగా పెద్ద వింతే. సభలో ప్రతిపక్షాలు ఆందోళనలు చెయ్యడం అధికార పక్షానికి మొండి వైఖరి చూపించడం ఇదంతా చూసి అసహనం తో అధికార పక్షం కోపం చూపించడం. ఎలాగైనా తమ పంతం నేగ్గించుకోవడం. ప్రతిపక్షాలని స్పీకర్ సస్పెండ్ చెయ్యడం ఇవన్నీ ఎప్పుడూ మనం చూసే విషయాలు.

 

 

 

 లోక్ సభలో తిరుగులేని మెజారిటీ ఉన్నా కూడా రాజ్యసభ లో ఏ బిల్లు పాస్ చెయ్యాలి అన్నా బలం లేక ఇబ్బంది పడుతోంది ఎన్డీయే  దాంతో, కాంగ్రెస్‌ని బతిమాలుకోవాల్సింది.. తప్పదు ఎన్డీయేకి. అందుకే ఈ ఏకాభిప్రాయం' అనే విషయాన్ని తెరమీదకి తీసుకుని వచ్చారు మోడీ.  ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని చర్చల కోసం ఆహ్వానించారు ఆయన. కీలకమైన కొన్ని బిల్లుల కోసం ఇలా ప్రతిపక్షం కాళ్ళు పట్టుకోక తప్పడం లేదు.

 

 

 

 

సోనియా కూడా మన్మోహన్ తో పాటు చర్చలో ఎలాంటి గొడవా చెయ్యకుండా పాల్గొనడం గమనార్హం. సానుకూలంగా చర్చలు జరిగాయి అని కేంద్రం మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ఇంకా విశేషం. మరొక సారి చర్చలు జరుగుతాయి అని కూడా ఆయన అన్నారు. ప్రతిష్టంభన అలాగే ఉండడం వలన మరొకసారి చర్చలు జరగాలి అని ఆయన అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: