అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలూ ఒక ఎత్తు తమిళనాడు లో ఒక ఎత్తు. అక్కడ అధికార ప్రతిపక్షాల కంటే కక్షిదారులు ఎక్కువగా ఉంటారు. అన్నా డీఎంకే - డీఎంకే ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అది చాలా సాధారణం కూడా. అమ్మ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వానికి డీఎంకే అంటే క్షణం పడదు.

 

 

 

ఈ పరిస్థితి లో తమిళనాడు డీఎంకే లో ముఖ్య మంత్రి పదవి కి పొటీ దారుడు గా ఉన్న స్టాలిన్  ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి జయలలిత కి ఊహించని సలహా ఇచ్చారు. ఏప్రిల్ ఒకటి నుంచీ బీహార్ లో నితీష్ కుమార్ మద్యం నిషేధిస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జయలలిత కి కూడా కొన్ని సూచనలు చేసారు స్టాలిన్  . "మధ్యనిషేధం విషయంలో బీహార్ సీఎం నితీశ్కుమార్ తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైంది. మద్యం బారిన పడి తమిళనాడులో పలు కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి. నితీష్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అమలు చేద్దాం " అంటూ ఆయన అమ్మని కోరారు.

 

 

 

 నితేష్ ని అనుసరిస్తూ ఇక్కడ మద్య నిషేద చట్టం తీసుకురావాలి అని డిమాండ్ చేసారు. అసంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ ఇచ్చిన భారీ హామీ అదే , మద్యం అమ్మకాలు పూర్తిగా ఏప్రిల్ నుంచీ బీహార్ లో రద్దు అవుతాయి. ఆ వాగ్దానం తోనే ఎన్నికల్లో నితీష్ ఎన్నికల్లో విజయపతాకం ఎగరేసారు అని ఎనలిస్ట్ లు చెబుతున్నారు కానీ ఇది తమిళనాడు లో వర్క్ అవుతుందా లేదా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: