చంద్రబాబు, జగన్ రెండు విభిన్న ధ్రువాలన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎడ్డెం అంటే తెడ్డెం అనుకోవడం వెరీ కామన్. ఏపీలోని అనేక అంశాలపై వీరి అభిప్రాయాలు అలాగే ఉంటున్నాయి. చివరకు అతి కీలకమైన రాజధాని నిర్మాణం విషయంలోనూ వీరిద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరకు రాజధాని శంకుస్థాపనకు కూడా ప్రతిపక్షనేత జగన్ హాజరుకానంత రేంజ్ లో వీరి మధ్య విబేధాలున్నాయి. 

కానీ విచిత్రంగా వీరిద్దరూ ప్రస్తుతం ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం చూపుతున్నారు. అది కూడా మీడియా, ప్రతిపక్షాల వ్యవహారం. ఒక మాట అంటే ఇద్దరూ సేమ్ డైలాగ్ చెబుతున్నారు కానీ అసలు సారాంశంలో మాత్రం ఇద్దరూ వ్యతిరేకమేనండోయ్. అదేంటంటే.. మొన్న తెలంగాణలో వరంగల్ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడి తెలుగుదేశం పార్టీ మీడియా విషయంలో కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించాయి. 

కేసీఆర్ కు జనం అదికారం ఇచ్చింది ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి కాదని, మీడియాపై ఆంక్షలు పెట్టడానికి కాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ అధికార ప్రతినిది నన్నూరి నరిసిరెడ్డి ఈ అంశంపై ఓ ప్రకటన కూడా చేశారు. విపక్షాలను తిడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ తప్పుబట్టింది. అంతవరకూ బాగానే ఉంది. 

విచిత్రం ఏంటంటే.. అదే టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. అక్కడి ప్రతిపక్షం కూడా చంద్రబాబుపై సేమ్ టు సేమ్ ఇలాంటి ఆరోపణలే చేస్తోంది. చంద్రబాబు మీడియాను బెదిరిస్తున్నారని.. కొన్ని ఛానళ్లను బెదిరించడం ద్వారా దారికి తెచ్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షాల వైఖరిని కూడా చంద్రబాబు ఇటీవల తరచుగా తప్పబడుతున్నారు. అంటే టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ చెబుతున్నది ఒకటే మాటన్నమాట. అదీ అసలు సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: