ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చంద్రబాబును సపోర్ట్ చేస్తాయని.. ఆయన వాయిస్ వినిపిస్తాయన్న సంగతి జగమెరిగిన సత్యమే. కాకపోతే.. బాబు అనుకూల వార్తలను ఈనాడు కాస్త పద్దతిగా ఇస్తే.. ఆంధ్రజ్యోతి అందరికీ తెలిసిపోయేలా పూనకం వచ్చినట్టు ఇస్తుంటుందన్న విశ్లేషణలు వినిపిస్తుంటాయి. ఇవి కాకుండా చంద్రబాబు నేరుగా మీడియా 
సంబంధాలు పెట్టుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయట. 

అవేంటంటే.. స్టూడియో ఎన్ అనే ఛానల్ ను చంద్రబాబు కుమారుడు లోకేశ్ కొంతకాలం నడిపించాడట. వాస్తవానికి ఈ ఛానల్ యజమాని జూనియర్ ఎన్టీఆర్ మామ అయిన నార్నె శ్రీనివాసరావు. ఎన్టీఆర్ పెళ్లి కాక ముందు చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా నార్నె శ్రీనివాసరావు తన ఛానల్ ను లోకేశ్ కు అప్పగించారట. అప్పట్లో ఆ ఛానల్ టీడీపీ మౌత్ పీస్ గానే పనిచేసిందట. 

అంతేకాదు.. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలు చూస్తారని పేరున్న బిజినెస్ పొలిటీషియన్ సుజనా చౌదరి స్వయంగా ఓ ఛానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. అదే మహా టీవీ. ఆ ఛానల్ కూడా బాబుగారి పక్షమే. ఇక ఆంధ్రజ్యోతి ఏబీఎన్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు ప్రత్యేకంగా మీడియా లేదని చంద్రబాబు తరచూ చెప్పుకుంటుంటారు. తన పాలనే తనకు ప్రచారం కల్పిస్తుందని అంటుంటారు. 

అంతే కాదు.. ఆయన ఇటీవల సాక్షి పత్రికపై మరీ ఎక్కువగా ఫైర్ అవుతున్నారు. అవినీతి సొమ్ముతో పత్రికలు పెట్టి తనపై బురద చల్లుతున్నారని మొన్న ఇసుక విధాన ప్రకటన సమయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తనకు మీడియా సంస్థలు లేవని చెప్పారు. అందుకే ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ వైసీపీ బయటపెట్టింది. ఆ పార్టీ నేత అంబటి పై విషయాలు వివరిస్తూ.. మీడియాతో ఇన్ని లింకులున్న చంద్రబాబు జగన్ ను ఎలా విమర్శిస్తారని పాయింట్ లాగారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: