సాధువులను చూస్తే ఎవరికైనా భక్తి భావం కలుగుతుంది. ఆధ్యాత్మికత స్ఫురణకు వస్తుంది. కానీ కొందరు మహిళలను బాబాలను కూడా వదలిపెట్టరట. అన్నీ వదిలేసి కాషాయం కట్టుకున్న సాధువులపైనా మనసు పారేసుకుంటారట.  కేవలం మనసు పారేసుకోవడమే కాదు.. సదరు బాబాలను ముగ్గులోకి దింపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తారట. 

ఈ విషయం స్వయంగా రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. ఈ కబుర్లలో ఎంతవరకూ వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ.. తన వెంట ఎందరో మహిళలు కామంతో వెంట పడ్డారని రాందేవ్ బాబా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కలకలం రేపుతోంది. ఆ మధ్య ఓ సినీ హీరోయిన్ రాందేవ్ బాబాపై కన్నేసిందట. ఆయన దగ్గరకు వెళ్లి తనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చిందట. 

సదరు హీరోయిన్ ప్రవర్తనతో షాక్ అయిన రాందేవ్ బాబా ఆమెను వదిలించుకునేందుకు నానా తంటాలు పడ్డారట. ఆమె నుంచి ఏదోలా బయటపడ్డారట. అయితే ఆ హీరోయిన్ పేరు చెప్పేందుకు మాత్రం బాబా అంగీకరించలేదు. అలాంటి అనుభవాలు తనకు చాలా ఎదురయ్యాయని రాందేవ్ బాబా ఉత్సాహంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఒక మహిళ ఇలాగే తనను సతాయించిందట. 

తనతో ఏకాంతంగా మాట్లాడుతానని.. రాందేవ్ బాబా కోరితే తన సర్వస్వాన్ని అతనికి ఆర్పిస్తానని బతిమాలుకుందట. ఆ సందర్భంలో కూడా తాను క్రమంగా జారుకున్నానని రాందేవ్ బాబా చెబుతున్నారు. ఆ మహిళలంటే కామ, మోహ బంధాల్లో చిక్కుకున్నవారు.. అంతవరకూ ఓకే.. కానీ ఇలాంటి విషయాలు మనసులో ఉంచుకోకుండా ఇలా బయటకు చెప్పడం ఓ సాధువుగా రాందేవ్ కు తగునా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: