తెలంగాణలో పనిచేయని బోరుబావులను వెంటనే మూసి వేయాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఐటీ మంత్రి కేటీఆర్. మొన్న మెదక్ జిల్లాలో ఆ మొన్న నల్లగండ ఇలా పనిచేయని బోరు బావి గుంటల్లో చిన్నారు తమ ప్రాణాలు కోల్పోయి కన్నవారికి శోకం మిగుల్చుతున్నారు. బోరు బావుల వల్ల జరుగుతున్న ప్రమాదాలను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. తాజగా ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసి వేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపయోగపడే బోరు బావులకు చుట్టూ ఫెన్సింగ్ వేయించేలా వెంటనే సర్క్యులర్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను ఆదేశించారు.


మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం తండాలో బోరుబావిలో పడి బాలుడు చనిపోవడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు శాఖాపరమైన ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని బోరుబావులన్నింటి పైన సర్వే నిర్వహించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లతోపాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉపయోగంలో లేని బోరుబావులను గుర్తించడంలో ప్రజలు స్థానిక సర్పంచ్, సెక్రటరీలకు సహకరించాలన్నారు.


మంత్రి ఆదేశాలతో స్పందించిన అధికారులు వెంటనే తమ శాఖల ద్వారా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. తమ శాఖ తరపున గతంలోనే మార్గదర్శకాలు ఇచ్చామని, ఇలాంటి ఘటనలు జరుగకుండా పనిచేయని బోరుబావులను మూసి వేయాలని సూచించామన్నారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయాలని, పని చేస్తూ ఓపెన్ గా ఉన్న బోరుబావులకు క్యాప్ లు బిగించి, చుట్టూ ఫెన్షింగ్ వేయాలని తెలిపారు.


బోరువాయిలో పడి చనిపోయిన చిన్నారి


ఏది ఏమైనా మన చుట్టు జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం మనం చేసే నిర్లక్ష్యానికి చిన్న పిల్లలు బలి అవుతున్నారు. ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా అది మనలో రావాల్సిన మార్పు బోరు బావి కోసం తవ్విన గుంటలపై ఒక్క రాయి వేసినా మొన్న ఓ చిన్నారి బలి అయ్యి ఉండే వాడు కాదని చాలా మంది వాపోయారు. కానీ తప్పు జరిగిపోయింది ఇప్పటికైనా ఇలాంటి పని చేయని బోరు గుంటలపై రాళ్లు కానీ చుట్టు ఫినిషింగ్ కంచె కానీ వేసి చిన్నారులు బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: