చంద్రబాబును విమర్శించడంలో హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రోజాది డిఫరెంట్ స్టైల్. ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా చంద్రబాబు అనరాని మాటల అనడంలో ఆమె ప్రత్యేకతే వేరు. అయితే ఈ మధ్య రాజకీయాల్లో తక్కువ.. టీవీ ప్రోగ్రాముల్లో ఎక్కువ అన్నట్టు తయారైంది రోజా పరిస్థితి. పాపం చంద్రబాబును తిట్టి చాలా రోజులైనట్టుంది. అందుకే లేటెస్టుగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును ఏకి పారేసింది. 

దాదాపు మూడు నెలల తర్వాత సెక్రటేరియట్ ముఖం చూసిన చంద్రబాబు అధికారులకు హయ్యెస్ట్ టార్గెట్స్ ఫిక్స్ చేశారు. దాదాపు 15శాతం అభివృద్ధి సాధించాలని చెప్పారు.  నిజానికి 15 శాతం అభివృద్ధి అంటే మాటలు కాదు.. మన దేశం అత్యధికంగా 9-10 శాతం అభివృద్ధి అదీ వాజ్ పేయ్ హయాంలో జరిగింది. ఆ తర్వాత నుంచి గ్రోత్ రేట్ పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం 7-8 శాతం గ్రోత్ సాధించడం మహా గొప్ప. 

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 7-8 శాతం అభివృద్దే రికార్డు.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గొప్పలకు పోయి 15 శాతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని రోజా మండిపడింది. సీఎంగా ట్లాడుతున్నారా? లేదా పోలిగాడి మాదిరి బొంకుతున్నారా? అంటూ ఘాటుగా విమర్సించింది. బొంకరా...బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయలంత..అంటూ సామెతలు చెప్పి మరీ బాబు గాలి తీసేసింది.

అసలే.. వ్యవసాయ రంగం కష్టాల్లో ఉంది. రాష్ట్రం కరువు, వరదలతో కుదేలవుతోంది. మరోవైపు విభజనతో 70 % పరిశ్రమలు.. 95% ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉండిపోతే ఏపీలో వృద్ధిరేటు రెండింతలెలా అవుతుందని లాజిక్కులాగి చంద్రబాబు ప్రసంగంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ప్రజలను భ్రమల్లో  ఉంచడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబులా అబద్దాలు చెబితే విదేశాల్లో జైల్లోగానీ, పిచ్చాసుపత్రిలోగాని ఉంచుతారని రోజా సెటైర్లు వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: