ప్రస్తుతం భారత్‌ను పీడిస్తున్నదేమిటి? ఇది లౌకికవాదం లేదా అసహనం వంటి అంశాలపై వాదన కోసం వేస్తున్న ప్రశ్న మాత్రం కాదు. వైద్య పరిశోధకులను ప్రస్తుతం కలవరపరుస్తున్న నిజమైన వైద్యానికి సంబంధించిన ప్రశ్న. ఇంతవరకూ ఈ ప్రశ్నకు అంచనాలు మాత్రమే ఉండేవి కాని పూర్తి స్థాయి పరిశోధనలు మాత్రం జరిగి ఉండలేదు. ప్రస్తుతం వైద్యులు ధృవీకరించిన ఒక డేటాబేస్ భారత్‌ను నిజంగా బాధిస్తున్నది ఏమిటనే విషయంపై కొత్త కాంతిని ప్రసరిస్తోంది. భారత దేశంలోని విషపూరితమైన గాలి పలువురు భారతీయులకు శ్వాస సమస్యలను తెచ్చిపెడుతోందన్న విషయం దాదాపుగా అందరకీ తెలిసిన విషయమే. 


కానీ తాజా అధ్యయనం కనగొన్న ఫలితాలకు వైద్యులోకాన్ని దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. మన దేశంలో రోజుకు మూడున్నర కోట్లమంది ప్రజలు వైద్యులను సంప్రదిస్తున్నారని తేలింది. దీన్ని గణాంకాల్లో చెప్పాలంటే కెనడా జనాభా లేదా మన నాలుగు మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్‌ల మొత్తం జనాభాని కలిపితే ఎంతమందవుతారో అంతమంది ప్రతిరోజూ దేశంలో వైద్యుల వద్దకు పరుగెడుతున్నారని తెలిసింది. భారత్‌లో ప్రతి రోజూ ఇంతమంది రోగులు వైద్యులను సంప్రదిస్తున్నారన్న విషయం ఆశ్చర్యం గొల్పుతోందని పుణేకు చెందిన చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన పరిశోధకుడు సందీప్ సాల్వి పేర్కొన్నారు.


ప్రపంచ జనాభా 2015లో 750 కోట్లకు చేరుకుందనుకుంటే  దాంట్లో 120 కోట్లమంది భారతీయులే. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 18 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత అధికంగా వ్యాధిగ్రస్తులున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లోని రోగుల్లో సగం మందికి పైగా శ్వాస సంబంధిత వ్యాధులతో నలిగిపోతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. దేశంలో ఇళ్లలో, బయట ఉన్న వాయు కాలుష్యం కారణంగా అస్తమా, బ్రాంకోయిట్స్ వంటి వ్యాధులు రోగులను పట్టి పీడిస్తున్నాయని సాల్వి చెప్పారు.


2011లో వ్యాధులకు సంబంధించి సీజన్‌లో తటస్త దినమైన  ఫిబ్రవరి 1న భారత్ లోని 880 నగరాల్లో భారీ స్థాయిన జరిపిన అధ్యయనంలో దాదాపు 12 వేలమంది వైద్యులు పాల్గొన్నారు. ఈ భారీ అధ్యయనం వివరాలను డిసెంబర్‌లో ది లాన్సెట్-గ్లోబల్ హల్త్ జర్నల్‌లో ప్రచురించనున్నారు. అలాగే 40 ఏళ్ల లోపు వయస్సున్న భారతీయులలో 21 శాతం మంది అధిక రక్తపోటును కలిగి ఉన్నారని ఈ అధ్యయనం చెప్పిన వివరాలు జాతిని హెచ్చరిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: