రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గకన మొదటి ప్రధాని అయి ఉంటే..పాకిస్థాన్ లా తయారయ్యేదని, ప్రజాస్వామ్యం పతనమయ్యేదని దళిత హక్కుల నేత, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ లో 'రీ ఇమాజినింగ్ ది రిపబ్లిక్స్ ఐకాన్స్: పటేల్, నెహ్రు, అంబేద్కర్' అనే అంశంపై చర్చలో తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

2014 ఎన్నికల సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. పటేల్ తొలి ప్రధాని అయితే భారత్ మరోలా ఉండేదని ప్రధాని మోడీ అన్నారని కంచె ఐలయ్య అన్నారు. అతను డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌ను రాజ్యాంగం రాసేందుకు అనుమతించేవాడు కాదన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందూ మహాసభకు దగ్గరగా ఉండేవాడని, మనుస్మృతిని నమ్మిన వారే రాయాలని ఆయన భావించేవారన్నారు.టేల్ భారత దేశ తొలి హోంమంత్రి. దేశంలోని అనేక సంస్థాలను ఏకతాటి పైకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానంను కూడా భారత్‌లో కలపడంలో పటేల్ పాత్ర ఎంతో ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: