ప్రపంచంలో ఇప్పుడు మీడియా అంతా ఇద్దరు వ్యక్తులపైనే ఫోకస్ చేస్తుంది..మరి ఆ ఇద్దరు ఎవరా అనుకుంటున్నారా..? పచ్చగడ్డి వేస్తే భగ్గుమని దేశాధినేతలు ఒకరు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మరొకరు భారత ప్రధాని నరేంద్ర మోడి. గత కొంత కాలంగా పాకిస్థాన్ కవ్వింపు మాటలు మాట్లాడుతూనే.. భారత దేశం బర్డర్ లో గల సైనికుల తో యుద్దం చేస్తూనే ఉంది. పైకి మాత్రం భారత్ తో దోస్తీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంది.

ఇక వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేశారు. సదస్సుకు వచ్చిన షరీఫ్‌తో మోదీ భేటీ అయి కాసేపు ముచ్చటించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ శివార్లలోని లె బౌర్జెట్‌లో  ఐరాస నేతృత్వంలో వాతావరణ మార్పులు-సీవోపీ21 సదస్సు జరుగుతోంది. కాప్ ‌21 సదస్సులో ప్రధానులు మోడీ,నవాజ్‌ కరచాలనం చేసుకున్నారు  జూన్‌ 10 తర్వాత వీరిద్దరు కసులుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సమావేశంలో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మోడీ భేటీ కానున్నారు.భారత సరిహద్దు వద్ద పాక్‌ కాల్పులకు తెగబడుతుంది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నించాలని మోడీ కోరారు. ఈ సందర్భంగా మోడీ, నవాజ్ షరీఫ్ మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: