భారత దేశంలో గత కొంత కాలంగా  బీఫ్‌కు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కాక రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయ్యారు.  తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ గొడవ హైదరాబాద్ గోషామహల్ బిజెపి శాసనసభ్యుడు రాజాసింగ్‌కు, ఉస్మానియా విద్యార్థులకు మధ్య వివాదంగా మారింది. రాజాసింగ్‌పై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బీఫ్‌కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న చర్యలకు నిరసనగా డిసెంబర్ 10న యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. మరో వైపు బీఫ్ ఫెస్టివల్కు అనుమతించొద్దని కోరుతూ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ యూనివర్సిటీ వీసీకు లేఖ రాశారు. యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, హోంమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని హిందూ జానజాగృతి సమితి నేతలు విజ్ఞప్తిచేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ


గోవులను పూజించే సంస్కృతి ఉన్న దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చట్టపరిధిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తామని నేతలు చెప్పారు.ఎన్ని అడ్డంకులు కల్పించినా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని విద్యార్థులు చెప్పారు. ప్రజల ఆహారం అలవాట్లను బిజెపి ప్రభుత్వం నియంత్రించే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని చెప్పుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: