ఆంధ్రప్రదేశ్ లో తెగులు దేశం ప్రజల్లో అభిమానం పొందడానికి మరో ప్రయత్నంగా జనచైతన్య యాత్రలను నిర్వహించనుంది. ఇందులోభాగంగా ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా వేమూరులో జన చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలో  టీడీపీ నిర్వహించిన జనచైతన్య యాత్ర పెద్ద దుమారమే రేపింది. తమ బాధ చెప్పడానికి వచ్చిన రైతులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది.  


వివరాల్లోకి వెళితే..పోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి రైతులు గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తమ నిర్ణయం చెబుతాం అంటూ జాప్యం చేస్తూ వస్తుంది. ఇక టీడీపీ జనచైతన్య యాత్ర లో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆద్వర్యంలో మంగళవారం కష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దకర అగ్రహారం తమ గోడు వినిపించేందుకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.


టీడీపీ


అందుకు మంత్రి అనుమతించకపోవడంతో వారు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాటిల్లో తమ డిమాండ్ పేర్కొన్నారు. అంతే తమ యాత్రను అడ్డుకుంటారా అని టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రైతులపై దాడి చేశారు.. అయితే దాడి సమయంలో తమ మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: