హర్యానా లో ఒక మినిస్టర్ ఐపీఎస్ అధికారిణి మీద సీరియస్ అయ్యారు ఆ విషయం లో ఇప్పుడు నేషనల్ మీడియా గుర్రుగా ఉంది. ఒక సమావేశంలో మహిళా ఐపీఎస్ ని బయటకి పొమ్మన్నాడు ఆ మంత్రి దాంతో ఆమె తనకి అక్కడ కూర్చునే అధికారం ఉంది అని తానెందుకు అక్కడనుంచి వెళ్ళాలి అని ప్రశ్నించింది. దాంతో మంత్రికి ఇంకా కోపం వచ్చి  "గెట్ అవుట్ ఫ్రం హియర్ ' అన్నాడు. ఆమె కదల్లేదు. మంత్రిగారికే అవమానం అనిపించింది. ఆయనే వెళ్ళిపోయాడు చివరకి.

 

 

 

 

 దీంతో హర్యానా ప్రభుత్వం ఈ మహిళా ఐపీఎస్ ని సస్పెండ్ చేసింది మంత్రిగారి అధికార అహంకారానికి ఆమె తలవంచక పోవడమే ఒక మహిళా అధికారి మీద చర్యలకి అర్ధం లేని సస్పెన్షన్ కి తావిచ్చింది. ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియా లో చర్చగా మారింది. ఒక మహిళా అధికారిణి మీద ఇంత దారుణం ఎందుకు అంత అహంకారం ఆయనకి పదవి ఇచ్చిందేగా అంటూ మీడియా ఆయన్ని ఎకేస్తోంది. ఎంత మంత్రులు అయినా సాధారణ జనాలకి సర్వెంట్ లే కదా అయినా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనేది మీడియా లో వార్త. రెండు మూడు రోజులుగా హర్యానా మంత్రినే లక్ష్యంగా చేసుకుని న్యూస్ ఛానల్స్ గొడవ చేస్తున్నాయి. అయితే ఇదంతా చూస్తే ఏపీ లో అధికారుల మీద జరుగుతున్న దాడుల సంగతి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి.

 

 

 

 

 

ఆ మధ్య ఒక మహిళా తహ సీల్దార్ మీద చింతమనేని ప్రభాకర్ ఆయన గ్యాంగు దాడి చేసారు. ఆ మహిళా అధికారి ని వారు కొట్టినట్టు వీడియో లు కూడా బయటపడ్డాక స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి మరీ పరిస్థితి చక్క దిద్దారు. ఇద్దరికీ రాజీ చేసారు. ఆ తరవాత డ్వాక్రా మహిళల విషయంలో కూడా చింతమనేని తప్పుడు వ్యాఖ్యలు చేసి మీడియా లో నిలిచారు. హర్యానా మంత్రి తీరుతో పోలిస్తే మన వారి తీరు చాలా దారుణం ఎటొచ్చీ ఆయన నేషనల్ మీడియా కి దొరికాడు ఈయన దొరకలేదు అంతే తేడా.

 


మరింత సమాచారం తెలుసుకోండి: