ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాల్లో టీడీపీ, వైసీపీల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో   సమావేశాల్లో రోజా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి  అసెంబ్లీ సమావేశాలు మొత్తం రోజా చుట్టూనే తిరిగాయి. రోజా వ్యవహార శైలిపైనా చాలా విమర్శలు వచ్చాయి. అసలు రోజా అసెంబ్లీలో అంత దుమారాన్ని రేపడానికి గల కారణాలు ఒక మహిళా ఎమ్మెల్యేని నీకులాగా నేను మొగుడ్ని వదిలేయలేదు.. నీకులాగా నేను రోజుకొకడితో పడుకోలేదు.. వంటి పదజాలం  అసెంబ్లీలో రోజా మాట్లాడటం నిజంగా దారుణమే.

ఈ మాటలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి... మరికొందరైతే ఏకంగా ఆమెను అసహ్యించుకుంటున్నారు. దీనిపై స్పందించిన రోజా తనపైనా, తాను వాడుతున్న భాషపైనా లేనిపోని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు మరి ఒకప్పుడు తాము వాడిన భాషను కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారులు మహిళలను వ్యభిచారం రొంపిలోకి లాగుతుంటే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు.

ఎమ్మార్వో వనజాక్షి కేసులో చంద్రబాబు మధ్యవర్తిగా సెటిల్ చేశారనడం నిజం కాదా? అని అడిగారు. రిషితేశ్వరి కేసును ఏం చేశారు? కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని నిందితులను వెనకేసుకురావడం నిజం కాదా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని ఆడ కూతుళ్లను వ్యభిచారం రొంపిలోకి లాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించడం తప్పా? అని ఆమె నిలదీశారు. తాను టీడీపీలో ఉండగా వాడిన భాష తప్పు కానప్పుడు, వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు వాడితే తప్పు ఎలా అవుతుందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: