కోయంబత్తూర్ లో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన బారీ బహిరంగ సంభ విజయవంతమైంది. బాజాపా నేతలు అంచనాలకు అనుగుణంగా ఈ సభ జనసందోహంతో నిండిపోయింది.  ప్రధాని మోదీ సైతం ప్రజలను ఉత్తేజ పరిచేలా ప్రసంగం చేశారు. అరంభంలోనే తమిళంలో రెండు వ్యాఖ్యాలు మాట్లాడు సభకు వచ్చిన వారిని అందరినీ ఆశ్చర్య పరిచారు. నమస్కారం.. ఈ రోజు కోయంబత్తూర్ వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని తమిళంలో అన్నారు.

మొత్తానికి ఆయన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుందని ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరును, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని  బేరీజూ చేస్తూ చేసిన ప్రసంగానికి ప్రజలను నుంచి మంచి మద్దతు లభించింది.  గతంలో పాలించిన ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు చేస్తూ ప్రజల సొమ్ము అంతా దుబారా చేసి ప్రజల నెత్తిమీద ఎక్కడలేని భారం మోపిందని అన్నారు.

తమది ప్రజల ప్రభుత్వం అని పేదరికం నిర్మూలనకు పాటుపడే ప్రభుత్వం అని అందుకోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు మోదీ అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు రావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే..కాంగ్రెస్ ఎలా అడ్డు పడుతుందో ప్రజలకు వివరించారు. ప్రజల మద్దతు తమ ప్రభుత్వానకి ఎప్పుడూ ఉండాలని 20 నిమిషాల పాటు ప్రసంగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: