కొన్ని రోజుల క్రితం తునిలో చెలరేగిపోయిన కాపు ఐక్యవేదిక కార్యకర్తలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాపు కార్యకర్తలో చేశారో.. ప్రభుత్వం చెబుతున్నట్టు కాపు కార్యకర్తల ముసులో వైసీపీ ప్రేరేపించిన వారే చేశారో తెలియదు కానీ..అది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే అత్యంత భయానక ఘట్టం. ప్రముఖ నాయకులు హత్యలకు గురైనప్పుడు సాధారణంగా ఇలాంటి అరాచకం చూస్తాం.

తుని ఘటనను హ్యాండిల్ చేయడంలో పోలీసు వర్గాలు సంయమనం పాటించాయని అంతా మెచ్చుకున్నారు. లక్షల మంది ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తే ఎవరు మాత్రం కంట్రోల్ చేయగలరు. నిమిషాల్లోనే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఏదో సభ పెట్టుకుంటారు..నాలుగు మాటలు చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోతారనుకును సాధారణ భద్రత కల్పించిన అధికారులకు అది ఎంత తప్పో ఆ తర్వాత తెలిసి వచ్చింది. 

ఎన్నో సంక్షోభాలను, ఉద్విఘ్న ఘట్టాలను తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూసిన చంద్రబాబు కూడా తుని ఘటన రోజు చాలా టెన్షన్ పడ్డారట. ఆ విషయం కేబినెట్ సమావేశంలో చంద్రబాబే స్వయంగా చెప్పారట. ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రం అల్లకల్లోలమవుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నిమిషం నిమిషం ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. 

అసలే ఒక సామాజిక వర్గానికి చెందిన వారు రెచ్చిపోతున్నారని సమాచారం ఉన్నా.. ఆందోళనకారులపై లాఠీలు వేయకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. చాలా సంయమనం పాటించారు. ఏమాత్రం ఆగ్రహం చెందినా.. కంట్రోల్ తప్పినా పెను ప్రమాదమే జరిగి ఉండేది. బషీర్ బాగ్, ముదిగొండ వంటి ఘటనలను సైతం హ్యాండిల్ చేసిన చంద్రబాబు కాపుల సభ రోజు మాత్రం ఎక్కడ లేని టెన్షన్ అనుభవించారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: