ఒక దేశాన్ని కాపాడాలంటే సైన్యం ఎంతో ముఖ్యం..అలాంటి సైన్యాన్ని నడిపించాలంటే ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం.. కానీ ఆ బాబు వయస్సు 10 సంవత్సరాలు అయితేనేం యుద్దంలో సైన్యానికి నాయకత్వం వహించాడు..పెద్ద పెద్ద సైనికులు చేయాల్సిన పనులు కూడా తానే నిర్వహించాడు..సైన్యాన్ని గెలిపించి విజయోత్సవంలో పాల్గొన్నాడు. ఇంతకీ ఎవరా బాలుడు అనుకుంటున్నారా..? ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ గడ గడలాంచిన బాలుడు వాసిల్ అహ్మద్‌. అలాంటి చిన్నారిని కనికరం లేకుండా అత్యంత దారుణంగా హతమార్చారు తాలిబన్లు.

పదేళ్ల వయస్సులో మిలటరీ దళానికి నాయకత్వం వహించి, తుపాకి చేతపట్టి తాలిబన్లకు చుక్కలు చూపించి, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నుంచి శభాష్ అనింపించుకుని సన్మానాలు చేయించుకున్న పిల్లాడు వసిల్ అహ్మద్ (10) దారుణ హత్యకు గురైనాడు. గతంలో వసిల్ మామ ముల్లా అబ్దుల్ సమద్ తాలిబన్ ఉగ్రవాద దళాలకు కమాండర్ గా పని చేసేవాడు. ముల్లా సమద్ తో పాటు వసిల్ తండ్రి ఉగ్రవాదులలో ఉన్నాడు. తరువాత ముల్లా సమద్ తుపాకులు వదిలి పెట్టి వసిల్ తండ్రితో పాటు 36 మందితో కలిసి జనజీవన స్రవంతిలో కలిసి పోలీసులకు సహాయంగా సైన్యాన్ని ఏర్పాటు చేశారు.

తర్వాత తాలిబన్లు జరిపిన దాడిలో వసిల్ తండ్రితో పాటు 18 మంది మరణించారు.  ఆ సమయంలో ముల్లా సమద్ తీవ్ర గాయాలపాలయ్యాడు ఇక తన బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అనుకున్న సమయంలో పదేళ్ల చిన్నారి వాసిల్ ముందుకు వచ్చాడు.  పోలీసు సేనలకు కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. తాలిబన్లతో పోరాటం చేశాడు. తుపాకితో తాలిబన్లను అంతం చేశాడు. ఓరుజ్గన్ పరిసర ప్రాంతాల్లో తాలిబన్లు లేకుండా చేశాడు.

ఆ తర్వాత వసీల్  ప్రయోజకున్ని చేయాలనే ఉద్దేశ్యంతో కొద్దినెలల క్రితమే మిలీషియానుంచి బయటకు వచ్చిన వాసిల్ ఓ పాఠశాలలో నాలుగో తరగతిలో చేరాడు. అప్పటి నుంచి తాలిబన్లు ఆ చిన్నారిని చంపాలని కక్ష్యతో ఉన్నారు. అదును చూసి కూరగాయలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన వసిల్ను దారుణంగా హతమార్చారు. మోటారు బైక్పై వచ్చిన ఇద్దరు తాలిబన్లు గన్తో వసిల్ తలలోకి కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. ఓరుజ్గన్ ప్రావిన్స్లోని తిరిన్ కోట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: