భారత దేశంలో అందరూ కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటుంటే..పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు మరణించారు. దాడి జరిపిన ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే ఇలాంటి దాడులే మరోసారి జరుగుతాయని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వేలమందినుద్దేశించి సయీద్ మాట్లాడుతూ భారతసైన్యం కశ్మీరీల ఆకాంక్షలను అణచివేస్తుంటే.. రక్షణ కోసం పఠాన్‌కోట్ తరహాలో దాడులుచేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

 మేము అత్యంత సులువుగా మరిన్ని దాడులను చేయగలం’ అని అన్నాడు. భారత సైన్యం కశ్మీర్ ప్రజలపై మారణ హోమం చేస్తోందని ఆరోపించాడు. మరోవైపు, సయీద్‌ను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పాక్‌పై ఉందని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లో సయీద్  కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది.

నిజానికి సయీద్ చేస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక ఊతం అందించే చర్యలేనని స్పష్టం చేసింది. భారత్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా... తమను ఏం చేయలేదు కదా.. మరిన్ని దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పఠాన్‌కోట్ దాడికి హఫీజ్ సూత్రధారి అని భారత్ తన దగ్గర ఉన్న ఆధారాలను పాకిస్థాన్‌కు అందజేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఉగ్ర నేతను పట్టుకునే సాహసం చేయకపోవడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: