నిన్న సాయంత్రం నుంచీ హుటా హుటిన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి చేరుకొని హడావిడి చేసారు బొండా ఉమా మహేశ్వరరావు , తోట త్రిమూర్తులూ. చాలా తెలివిగలవాడి గా ఫీల్ అయ్యే చంద్రబాబు నాయుడు గారు కాపు ఎమ్మెల్యే లని పంపించి ఇవాళ నుంచీ ముద్రగడ పద్మనాభం మొదలు పెట్టిన నిరాహార దీక్ష ని ఆపెయ్యాలని చూసారు. కాపు ఉద్యమ నేతగా కొత్తగా తెరమీదకి వచ్చిన ముద్రగడ పద్మనాభం తో మాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం కోసమే బాబు వారిని పంపించారు అని విశ్వసనీయ సమాచారం.

 

 

 ప్రభుత్వం తో చర్చల విషయం అప్పటి వరకూ మాట్లాడని ముద్రగడ కూడా సడన్ గా " ప్రభుత్వం ఇప్పటి వరకూ నన్ను కదపలేదు, చర్చలకి నేను కూడా సిద్దమే " అంటూ తెల్ల జండా ఆయనే స్వయంగా ఊపి మరీ టీడీపీ ఎమ్మెల్యే లని ఆహ్వానించినట్టు ఉంది. ఇవాళ ఉదయం పోలీసు బందోబస్తు మధ్యన ఆమరణ నిరాహార దీక్ష మొదలైంది. కానీ నిన్న రాత్రి భారీ బేర సారాలు జరిగాయి అనీ ముద్రగడ గనక తన పంథా మార్చుకుని నిరాహార దీక్ష అలాంటివి చెయ్యడం మానేస్తే బాబు ఇస్తామన్న ప్యాకేజీ ఎమ్మెల్యే లు వివరించారు అనీ పుకార్లు లేచాయి. డబ్బు పెట్టి చంద్రబాబు ఈ కాపు ఉద్యమాన్ని అణిచి వెయ్యాలని చూస్తున్నారా ? దీనికి ముద్రగడ లొంగుతారా ? లొంగకుండా కాపు సామాజిక వర్గ జనాలు ఆయన మీద పెట్టుకున్న ఆశలు నిజం చేస్తారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: