వరంగల్ ఉప ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆమె కుమారులతో సహ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  ఉప ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ ఇవ్వవద్దని ఆమె కాంగ్రెస్ అదిష్టానానికి లేక రాయడం పై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సారిక తన కుమారులతో ఇంట్లోనే అగ్నికి ఆహుతి కావడంపై పలు అనుమానాలు రేకెత్తించాయి. మహిళా సంఘాలు రాజయ్య అరెస్టుకు డిమాండ్ చేశాయి. 


ఈ కేసులో సిరిసిల్ల రాజయ్య ఆయన సతీమణి మాధవి, కొడుకు అనిల్‌కుమార్‌కు అరెస్టు చేశారు. తాజాగా రాజయ్య ఆయన సతీమణి మాధవి, కొడుకు అనిల్‌కుమార్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ నాలుగో అదనపు మున్సిఫ్‌ కోర్టు ఇన్ చార్జి, ఆరవ అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి రఘునాథ్‌రెడ్డి   ఆదేశాలు జారీ చేశారు. 

కుమారులతో సారిక


చార్జ్‌షీట్‌ దాఖలయ్యే వరకు ప్రతీ ఆదివారం 10 నుంచి 5 గంటల మధ్య పోలీ్‌సస్టేషనకు వెళ్లి సంతకాలు చేయాలని, ఈ నెల 15లోగా ఆ ముగ్గురు తమ పాస్‌పోర్ట్‌లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ముగ్గురికి ప్రతి ఒక్కరూ రూ. 25 వేల జమానతుతో ఇద్దరు వ్యక్తుల పూచికత్తుపై న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: