చంద్రబాబు కి తిరుగు లేదు అంటూ 2014 ఎలెక్షన్ లో వారి తరఫున ప్రచారం చేసి వారిని ఏపీ , టీజీ లలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి ఏపీ లో మాత్రమే సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ , ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు చూసిన తరవాత అయినా బుద్ధి తెచ్చుకోవాలి అని కోరుతున్నారు సొంత అభిమానులు.

 

 

టీడీపీ ని అట్టే పట్టుకుని ఉండడం వలన ఏ మాత్రం ఉపయోగం లేదు అనీ బీజేపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనీ పవన్ సొంతగా ప్రయత్నిస్తే బాగుంటుంది అంటున్నారు వారు. జనసేన అనే పార్టీని పెట్టి మరీ పోటీ కి రాకుండా టీడీపీ ని సపోర్ట్ చెయ్యడం వారికి మొదటి నుంచీ రుచించలేదు. కానీ చంద్రబాబు కి మంచి అనుభవం ఉంది ఆయన అయితేనే చతికలు పడ్డ స్టేట్ ని బాగు చేస్తారు అనే లాజిక్ తో ముందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అంతా బాగున్నా ఇప్పుడు టీడీపీ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది.

 

 

 ముఖ్యంగా తెలంగాణా లో ఆ విషయం పెద్ద ఎన్నికల అప్పుడే తేలింది ఈ దెబ్బతో మొత్తంగా తత్వం బోధపడింది టీడీపీ కి . క్యాడర్ గట్టిగా ఉన్నా ఎంత ప్రచారం చేసినా టీడీపీ అంచనాలు తారుమారు చేస్తూ గులాబీ సునామీ సృష్టించింది. ఇంకా నయం గ్రేటర్ ఎన్నికలలో మా హీరో టీడీపీ - బీజేపీ కి ప్రచారం చేసి ఉన్న పరువు కూడా పోగొట్టుకోలేదు అని పవన్ ఫాన్స్ కాస్త ఊరట చెందుతున్నారు. టీడీపీ పార్టీ పునాదులతో సహా తెలంగాణాలో లేచిపోయింది కాబట్టి ఏపీ లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి, జనం ఎలాగూ కొత్త ఆశ వైపు చూస్తున్నారు కాబట్టి కళ్యాణ్ ఆ రకంగా ఏదైనా అడుగులు వెయ్యాలి తప్ప ఇంకా టీడీపీ - బీజేపీ అనుకుంటూ కూర్చుంటే పనవ్వదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: