టీఆర్ఎస్ యువనాయకుడు కేటీఆర్ తన రాజకీయ జీవితంలోనే అపురూపమైన విజయం అందుకున్నారు. రాజకీయాలకు కొత్తే అయినా పార్టీ శ్రేణులను సమర్థంగా నడిపించి హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి సీమాంధ్రులు ఎక్కువగా ప్రాంతాల్లోనూ కారు జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కారుతో దుమ్మలేపాడు. 

మరి ఇంత బ్రహ్మాండమైన విజయానికి కారణాలేంటి.. ఇంతగా టీఆర్ఎస్ ను గెలిపించిన అంశాలేంటి.. కేటీఆర్ ఎలాంటి వ్యుహం అనుసరించాడు.. కేటీఆర్ ను గెలిపించిందేంటి.. ఈ అంశాలు పరిశీలిస్తే.. కేటీఆర్ నాయకత్వ లక్షణాలే ఈ విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ విజయ సూత్రాల్లో మొదటిది సెటిలర్ల అనుకూల వైఖరి. 

నేను కూడా సెటిలర్లే.. నేను సిద్దిపేట నుంచి వచ్చా.. అంటూ సెటిలర్లలో నమ్మకం కలిగించారు. సీమాంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి టీఆర్ఎస్ కు ఓటేసేందుకు ఒప్పించారు. హైదరాబాద్ నలుమూలలా తిరిగి కేటీఆర్ చేసిన ప్రచారం రెండో విజయ సూత్రంగా చెప్పొచ్చు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 

ఇక కేటీఆర్ మూడో విజయ సూత్రం రెండు గదుల ఇళ్ల హమీ.. ఈ హామీ ఓట్ల వర్షం కురిపించింది. హైదరాబాద్ లో నిలువ నీడలేని పేదలు, అద్దెళ్లలో ఉండేవారు, బస్తీ వాసులను ఈ హామీ బాగా ఆకట్టుకుంది. గెలుపు గుర్రాల ఎంపిక నాలుగో విజయ సూత్రం. అవసరమైన చోట్ల సెటిలర్లకు సీట్లు ఇవ్వడానికి సైతం కేటీఆర్ వెనుకాడలేదు. మేయర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదిపారు.  

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామన్న ప్రచారం ఐదో విజయ సూత్రం. అధికార పార్టీనే గెలిపిస్తే హైదరాబాద్ బాగా అభివృద్ధి అవుతుంది.. టీడీపీ-బీజేపీ కూటమికి ఓటేస్తే హైదరాబాద్ అభివృద్ది ప్రతిబంధకం అవుతుందన్న విషయాన్ని కేటీఆర్ బాగా వివరించి చెప్పగలిగారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: