తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్రబిందువైన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల విషయమై పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు తనిచ్చిన స్పీచ్ తనకైనా అర్థమైందా? అని అనుమానంగా ఉందన్నారు. పవన్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు, కారులో తన పక్కన ఉన్నవాళ్ల చెప్పుడు మాటలతో ప్రభావితమై ఆ స్పీచ్ ఇచ్చారని అన్నారు.

''కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా.. స్వచ్ఛమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు.. విశ్వదాభి రామ వినుర వేమ'' అని కూడా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి అంటూ.. ఒక్కసారి జనసేన పార్టీ స్థాపించిన సందర్భంగా మీరిచ్చిన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి అంటూ విమర్శలు సంధించారు. అదే సమయంలో.. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాల్ని వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహి అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


గత వారం రోజుల క్రితం కాపు గర్జన మొదలైంది..ఈ సందర్భంగా భారీ ఎత్తున ముద్రగడకు మద్దతు పెరిగిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీంతో కాపుగర్జనపై అందరి దృష్టి పడింది..అంతే కాదు కాపు రిజర్వేషన్ పై స్పష్టత వచ్చే వరకు ముద్రగడ తన స్వగృహంలో దీక్షభూనారు. ఇప్పుడు అక్కడ టెన్షన్ వాతవరణం నెలకొంది. ఈ సమయంలో కాపు కులస్తుడైన పవన్ కళ్యాన్ దీనిపై సరైన రీతిలో స్పందించకపోవడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాంగోపాల్ వర్మ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: