కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరిందిఆయన మాత్రం ప్రభుత్వం దిగి వచ్చే వరకూ దీక్ష విరమించనని తేల్చి చెప్పేశారు.సీఎం మొండి అయితే తాను జగమొండినని క్లారిటీ ఇచ్చేశారు.


అంతేకాదు.. ఊరికే తాను మీడియాతో మాట్లాడనని కూడా చెప్పారుతనను కలిసేందుకు వస్తున్న అనుచరులపై ఆంక్షలు విధించడంపై ముద్రగడ మండిపడ్డారుఐతే..ముద్రగడ ఇంటి వద్ద పరిస్థితిని వివరించే క్రమంలో కొన్ని ఛానళ్లు అతి చేస్తున్నాయిసాధారణ సెక్యూరిటీగా ఉన్న పోలీసులను కూడా భారీగా మోహరించనట్టు స్క్రోలింగులు వేస్తున్నాయట.


ముద్రగడ ఇంటిని చుట్టుముట్టినట్టుఅరెస్టు చేయబోతున్నట్టుదీక్షను భగ్నం చేయబోతున్నట్టు స్క్రోలింగులు వేస్తున్నాయటదీంతో పోలీసులకు ఆగ్రహం వచ్చేసింది.ముద్రగడను అరెస్టు చేస్తున్నట్లు రకరకాలుగా వివిధ ఛానాల్ళు ప్రసారం చేస్తున్నాయని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తూర్పుగోదావరి జిల్లా ఎస్‌.పిరవిప్రకాష్‌ తెలిపారు.


ఇప్పటికే జిల్లాలో శాంతి బద్రతల సమస్యలు ఉన్నందు వల్ల ఇలాంటి కథనాలు ప్రసారం చేసేటప్పుడు పోలీసులను సంప్రదించాలని కోరారుఅయితే తుని లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాంతి బధ్రత పరిరక్షించాల్సిన భాద్యతపోలీసులపై ఉందన్నారురకరకాల వదంతులు వల్ల ప్రజలకు ఆందోళనను గురిచేసే కథనాలు ప్రసారం చేయవద్దని ఆయన విఙ్ఞప్తి చేసారు.


శాంతిభద్రతలను విఘాతం కలిగితే ఎవరూ బాధ్యత వహించరని... అప్పుడు అంతా పోలీసులనే తప్పుబడతారని ఎస్సీ సీరియస్ గా చెప్పారుముద్రగడ ఆరోగ్యం ఇబ్బంది కరంగా ఉన్నందున ఆసుపత్రికి తరలించాల్సిన వస్తే పోలీసులు వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారుదయచేసి సున్నితమైన సమస్యను జఠిలంగా మార్చవద్దని మీడియాకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: