అమరావతి ప్రాంతంలో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెక్రటేరియట్ కట్టేస్తాం.. జూన్ నాటికి కొత్త సెక్రటేరియట్లోకి ఉద్యోగులు వెళ్లిపోవాలిఇదీ పలు వేదికలపై మంత్రి నారాయణ పలికిన పలుకులుఆరు నెలల్లో కట్టేస్తామన్నారుఆఘమేఘాల మీద నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.


అర్జంటుగా కొత్త సెక్రటేరియట్ కట్టేయాలన్న ఆత్రుత మంచిదేకానీ అందుకు అన్ని పరిస్థితులూ అనుకూలించాలిగాఆరంభంలోనే టెంపరరీ సచివాలయ నిర్మాణం టెండర్ల విషయంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొందిటెండర్‌ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.


ఈ సెక్రటేరియట్ కోసం మూడు ప్యాకేజీలుగా పనులు విభజించారుటెండర్లు పిలిచారు. 6నెలల్లో కట్టగలిగే వారే టెండర్ దాఖలు చేయాలని రూలు పెట్టారుతీరా బిడ్లు ఓపెన్ చేసి చూస్తే.. కేవలం రెండు కంపెనీలే టెండర్లు దాఖలు చేశాయట. ఎల్ అండ్ టీషాపూర్ జీ పల్లోంజీ కంపెనీలు సర్కారు నిర్దేశించిన 180 కోట్ల కంటే ఎక్కువ ధరకు టెండర్లు వేశాయట.


నిబంధనల ప్రకారం సర్కారు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ కోట్ చేస్తే ఆ పని అప్పగించరుఅందుకే రేటు తగ్గించుకోమని ఆ కంపెనీలను ఏపీ అధికారులు బతిమాలుతున్నారుఆ కంపెనీలు రేటు తగ్గించుకుంటే సరే సరిలేకపోతే ఏం జరుగుతుందిఅప్పుడు మళ్లీ టెండర్లకు వెళ్లాలిఅంటే మరికొంత జాప్యం అన్నమాటమరి ఇలా రెండడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే తరహాలో పనులుంటే ఆరునెలల్లో అయినా సెక్రటేరియట్ పూర్తవుతుందా.. ఏమో అనుమానమే.



మరింత సమాచారం తెలుసుకోండి: