ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని కొత్తగా కోరే కోరికేం కాదని ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ కోసం దీక్షభూనారు. ఆయన స్వగృహంలోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజుతో నాలుగో రోజు చేరుకోవడంతో.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణిస్తుంది. మరో వైపు ఆయన సతీమణి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షిణించింది. అయితే ఇప్పటికే ఓ దఫా తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులు ముద్రగడతో ఆదివారం చర్చించారు.

సోమవారం మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ఏపీ చీఫ్ కళా వెంకట్రావులు ముద్రగడతో చర్చలు జరుపనున్నారు.కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపులు, ఇతర కీలక అంశాలపై ముద్రగడతో చర్చించనున్నారు. కార్పొరేషన్‌కు రూ.వంద కోట్లు కేటాయించడంపై అభ్యంతరం చెబుతున్న ముద్రగడ మరిన్ని డిమాండ్లు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిన్న రాత్రి చర్చల్లోనే ముద్రగడ విషయమై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు మరోసారి చర్చించి, ఆయనతో దీక్ష విరమింప చేస్తారని అంటున్నారు. తుని ఘటన కేసు ఎత్తివేత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌లో ముద్రగడ చెప్పిన వారికి ఒక్కరికి స్థానం, మరో ఏడున్నర నెలల్లో కమిషన్ నివేదిక, కాపులకు రూ.వెయ్యి కోట్ల విషయమై షరతులు పెట్టారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: