యుద్ధ నౌకలు తయారు చేయడం దగ్గర నుంచీ వాటి మైంటైన్  చెయ్యడం వరకూ చాలా పెద్ద విషయం. అది మనం అనుకున్నంత తేలికగా జరిగే విషయం కాదు. భారత నావికా దళం లో ప్రస్తుతం 'ఐ యెన్ ఎస్' విరాట్ విపరీతమైన పాత్ర పోషిస్తోంది. ఇదేదో సాధారణ నౌక అనుకునేరు, ఏ మాత్రం కానే కాదు. భారత దేశానికి స్వతంత్రం రాక ముందర సమయం నుంచీ తయారయిన ఈ విరాట్ అప్పట్లోనే యూకే రాయల్ నేవీ కి సేవలు అందించిన ఘనత సొంత చేసుకుంది.

                                                                                                                                     

 

రాయల్ నేవీ నుంచి ఇండియా వారు దాన్ని కొనేసారు పేరు మార్చి ' ఐయెన్ఎస్ విరాట్' అంటూ నామకరణం చేసారు వారు. ఇండియా లో 1987 నుంచీ సేవలు అందిస్తోంది ఈ యుద్ధ నౌక. ఇదివరకు ఎప్పటి నుంచో విరాట్ ని సేవల నుంచీ తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ భరత్ మొత్తానికీ ఈ రేంజ్ లో సేవ చేసే మరొక విమాన వాహక యుద్ధ నౌక ఇంకొకటి లేనేలేదు సో తప్పించే ప్రయత్నం మానేస్తూ వచ్చారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు లెక్కలోకి తీసుకునే విరాట్ కి ఇక విముక్తి దగ్గరకి వచ్చినట్టే కనిపిస్తోంది. విరాట్ గత సంవత్సరం ఇచ్చిన ప్రతిపాదనల లెక్కన ఈ సంవత్సరం విధుల నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. రాబోయే జూన్ లో టాటా చెప్పే అవకాశం ఉంది. సో దీన్ని సేవల నుంచి తప్పించిన తరవాత నావీ దగ్గర పెట్టుకోరు, ఎక్కడ ఉంచాలి అనేదాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతోంది, ఆంధ్ర ప్రదేశ్ కి విరాట్ రావాలి అనే కొత్త వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

విశాఖ లో విరాట్ ని ఒక 'నావికా మ్యూజియం' గా మార్చి పర్యాటక శాఖకి ఇచ్చి పర్యాటక రంగానికి ప్రత్యేక ఊతం ఇవ్వడం లాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. కేంద్రం విరాట్ ని తమ కి ఇవ్వబోతోంది అనీ దానికి అంగీకారం కూడా వచ్చింది అనీ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి అధికారిక ప్రకటన కూడా చేసారు. అయితే జూన్ లో ఇది జరుగుతుందా జరగదా అనేది చూడాలి. ఎందుకంటే ఇండియన్ నేవీ దీన్ని ఒదులుకునేందుకు ఇష్టపడడం లేదు. అంతా మంచిగా జరిగి వైజాగ్ కి విరాట్ ఒస్తే మాత్రం పర్యాటక రంగం లో వైజాగ్ కి చాలా పెద్ద మేలు జరిగినట్టే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: