ప్రపంచంలో ఎవరికైనా దైవ భక్తి చాలా ఉంటుంది. ఆయా మత సిద్దాంతాలను బట్టి దేవుళ్లను కొలుస్తుంటారు. ఇక హిందూ దేవతలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నారు. ఎన్నోరకాల దేవతా,దేవుళ్లను మనం పూజిస్తుంటాం. అయితే కొన్నిసార్లు దేవభక్తితో భగవంతున్ని దర్శించాలన్న సందర్భంలో అపశృతులు చోటు చేసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. ఆ మద్య కేథరినాథ్ శివున్ని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు వరదల రూపంలో మృత్యువు ఎదురైంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పుష్కరాల్లో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయంలో అపశృతి జరిగింది. మహోదయ అమావాస్య సందర్భంగా భక్తులు ఆలయ కొలనులో పుణ్యస్నానాలు చేసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు.

ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు నీట మునిగి చనిపోయినట్లు అధికారులు తెలిపారు.ఆలయంలో అయ్యన్ తీర్థవారికులం కార్యక్రమంలో అర్చకులతోపాటు సుమారు రెండు వేల మంది భక్తులు కోనేరులో పవిత్ర స్నానానికి యత్నించగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఇరుక్కున్న మరో 50 మందిని పోలీసులు రక్షించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: