చిరంజీవి విషయం లో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని, ఆలోచించని చంద్రబాబు నాయుడు మొన్న ముద్రగడ దీక్ష సమయం లో కాస్త ఎక్కువ మాట్లాడినట్టు అనిపించింది. చిరంజీవి ముద్రగడ ని కలవడానికి తూర్పు గోదావరి కి వెళ్ళిన సమయం లో కుల రాజకీయాలు సృష్టించి రాష్ట్రం లో శాంతి భద్రతల కి విఘాతం కలిగించాలి అనుకోవడం తప్పు అంటూ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి ని ఏసుకున్నారు బాబు.

 

 

తరవాత " చిరంజీవి కి అక్కడ పనేంటి ? " అంటూ డైరెక్ట్ గానే ప్రశ్నించారు. నిజానికి చిరంజీవి రాజకీయ భవిష్యత్తు చాలా పెద్ద ప్రశ్నార్ధకమైనది. పేరుకి రాజ్యసభ సభ్యుడు కానీ రాజకీయ వేదికల మీద ఎక్కడా కనపడడు కూడా. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలు అయిన సమయం లో కూడా ఏపీ ప్రజల పక్షాన చిరంజీవి నిలిచినట్టు ఎక్కడా కనపడలేదు. సినిమాల్లో రీ ఎంట్రీ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చిరు ఈ కాపు గొడవలని రఘువీరా తో కలిసి క్యాష్ చేసుకోవడానికి చూసారు అని టాక్ నడుస్తోంది.

 

 

 

రాజకీయ నాయకులెవరైనా చేసేది రాజకీయమే. ఇందులో కొత్తగా చిరంజీవి రాజకీయం చేస్తున్నారనడానికి వీల్లేదు. చిరంజీవి మీద టీడీపీ చేసిన వ్యాఖ్యలని బహిరంగంగా తిప్పికొట్టడం కోసం ఆయన తరఫున ఎవరూ లేకపోవడం బాధాకరమైన విషయం. దాసరి మీద కూడా చంద్రబాబు ఘాటు విమర్శలే చేసారు కానీ వారిద్దరినీ కాపు నాయకులు కాదు కదా కాపు ప్రతినిధులు గా కూడా ఎవ్వరూ గుర్తించలేక పోయారు. ఆయన తరఫున చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వడానికి ఎవరూ లేకపోవడం చూస్తుంటే పాపం అనిపిస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: