తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాలు టీఆర్ఎస్ లోకి వలసబాట పట్టాయి. ఈ క్రమంలోనే తెలుగు దేశం సీనియర్ నేత ఎర్రబెల్లి దయకర్ రావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ కి చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు టీడీపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసిన అనంతరం నేతలు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. నేను కేసీఆర్‌ని ఏ పదవి అడగలేదు. అలాగే పదవి ఇస్తానని ఆయన అనలేదు. అసలు పదవి కోసం తాను టీఆర్ఎస్‌లోకి రావడంలేదు అని అన్నారు.

ఆరుసార్లు నన్ను జిల్లా ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఆ ప్రజల మనోభావాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు అంటే నాకు అభిమానమే. కొంచెం ఇబ్బందుల మధ్యే పార్టీని వీడుతున్నాను తప్ప మరేం లేదు. తెలంగాణలో టీడీపీ ఇక బతికే అవకాశం కనిపించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో కొనసాగడం మాత్రం ఎందుకనుకున్నాను అని ఎర్రబెల్లి వివరించారు అంతే కాదు టీడీపీని వీడటం బాధగా వుంది. మరో వైపు ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుతున్నారు. ఆ ప్రజల కోరిక మేరకే తాను పార్టీ మారడం జరుగుతోంది అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కూడా తనని ఎంతో గౌరవించే వారు. గతంలో టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. టీడీపీని నొప్పించడం ఇష్టంలేదు.

టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు


కేవలం అభివృద్ధి కోసమే పార్టీని వీడుతున్నాను అని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.  నాయిని నర్సింహా రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, హరీష్ రావు వంటి నేతల సమక్షంలో కేసీఆర్‌ని కలవడం జరిగింది.ద్దరు ఎమ్మెల్యేల చేరికతో టిడిపిని టీఆర్ఎస్ లో విలీనం చేసే అవకాశం ఉంది..మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు పార్టీని విలీనం చేయబోతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కు ఎర్రబెల్లి లేఖ రాసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..మరో ఇద్దరు టిటిడిపి ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నారని సమాచారం..ప్రస్తుతం గాంధీ, గోపినాథ్ లతో పాటు ఓటుకునోటు కేసు నిందితులు వీరయ్య, రేవంత్ లు, అలాగే నారాయణ్ పేట ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు మాత్రమే టీడీపీలో మిగిలిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: