తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది..అప్పటి నుంచి ఈ పార్టీ తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతూ వస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల ప్రాబల్యం పూర్తింగా తగ్గుతూ వచ్చింది. అంతే కాదు అప్పటి వరకు ఆయా పార్టీల్లో విధేయంగా ఉన్న సీనియర్ నాయకులు చిన్నగా టీఆర్ఎస్ లోకి వలస బాట పట్టారు. పార్టీ వీడి తమ పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులకు కేసీఆర్ మంచి బాధ్యతలే అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయకర్ రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్‌ జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి తాను టీడీపీలో పనిచేస్తున్నానని టీడీపీని వీడుతున్నందుకు బాధగా ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో చేరానని ఎర్రబెల్లి తెలిపారు. కార్యకర్తలందరూ క్షమించి సహకరించాలని కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. మరో ఇద్దరు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతారని పేర్కొన్నారు.

గతంలో వరంగల్ లో ఉప ఎన్నికల్లో జరిగిన పరాభం, ఈ మద్య జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితం చూస్తుంటే ఇక్కడ తెలుగు దేశాని ఎంత గడ్డు పరిస్తితి వచ్చిందో వేరే చెప్పనక్కర లేదు. ప్రజలు పూర్తిగా చైతన్య వంతులు అయ్యారని రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేస్తాం..చేస్తున్నాం అన్న వారికే పట్టం కడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వల్ల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తాను మనసు మార్చుకొని టీఆర్ఎస్ లో వస్తున్నట్టు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే దయాకర్ రావు


ఒకరొకరుగా సీనియర్లు, ఎమ్మెల్యేలు పార్టీని వీడటం తెలంగాణలో టీడీపీ నిర్మాణ వ్యవస్ధను బలహీనపరుస్తోంది. ఏది ఏమైనా, టీఆర్ఎస్ లో టీడీపీ నేతల చేరికను ఆ పార్టీ కూడా నేరుగా విమర్శించే అవకాశం లేకుండా పోయింది. దీంతో తెలుగు దేశం తనుపున పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా అందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: