హైదరాబాద్ లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా  సీఎం కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేయగా కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వారి పేర్లను ప్రకటించారు. గ్రేటర్ మేయర్‌గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ పేర్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ లకు పట్టం కట్టడం ఖాయమైంది.

జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీకే దక్కాయి.  ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ..హైదరాబాద్ నగర మేయర్ గా అవకాశం రావడం అదృష్టమని టిఆర్ఎస్ యువజన విబాగం అద్యక్షుడు బొంతు రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కేసీఆర్ సారథ్యంలో ముందుకు కదిలారు. మన రాష్ట్రం మన పాలన అనే విధంగా అరవై సంవత్సరాల నుంచి అణగారిపోయిన అభివృద్ది ఇప్పుడు మన చేతిల్లోనే ఉంది.

ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకానికి ఎప్పుడు సేవకులుగా సేవలందిస్తూనే ఉంటామని అన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రులు, టిఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం జరిగింది.మత్రులు కెటిఆర్,నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్,జగదీష్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అబివృద్ది ఫలాలు అందిస్తామని బొంతు చెప్పారు.హైదరాబాద్ అబివృద్ది కి విశేష కృషి జరుగుతోందని ఆయన చెప్పారు.గురువారం నాడు బొంతు రామ్మోహన్ మేయర్ గా ఎన్నికవుతున్న విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: